MBNR: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ గ్రూప్-1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతం చేస్తుందోనని వారు భయపడుతున్నారన్నారు.