AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్పుల కలకలం రేగింది. బత్తలపల్లి మండలం రామాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు హల్ చల్ చేశారు. ఇవాళ ఉదయం నలుగురు గ్రామంలోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్థులతో వారు మాట్లాడుతుండగా.. ఓ కారు అక్కడికి వచ్చింది. దీంతో నలుగురు వ్యక్తుల్లో ఒకరు తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం వారంతా అక్కడి నుంచి పారిపోయనట్లు గ్రామస్థులు చెబుతున్నారు.