AKP: తాగునీటి ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గిడుతూరు గ్రామస్థులు తెలిపారు. ఇక్కడి వరహానదిలో 18 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టును నిర్మించారు. దీనికి దగ్గరగా పగలు, రాత్రి ఇసుకను తవ్వి తరలిస్తున్నారని, స్థానిక నాయకులు పాత్ర ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.