నాగ చైతన్య ప్రధాన పాత్రలో కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ఓ బలమైన లేడీ పాత్రకి మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర విజయశాంతికి సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు సమాచారం.