Car Gears : కారు గేర్లు సరిగ్గా మార్చకపోతే ఇంజన్ మటాషే!
కారు కండిషన్లో ఉండాలన్నా, ఇంజన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా వేగానికి తగినట్లుగా గేర్లు మార్చడం అనేది తప్పనిసరి. మరి మీరు ఆ పని సరిగ్గా చేస్తున్నారో లేదో సరి చూసుకోండి.
How To Change Car Gears Correctly : కొత్తగా కార్లను నేర్చుకునే వారే కాదు… చాలా మంది కారు నడిచే తీరుకు అనుగుణంగా గేర్లు తరచుగా మారుస్తూ ఉండరు. ఒకే గేరులో(Gears) పోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కారు ఇంజనుకు తరచుగా సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎక్కువ ఇందనాన్నీ ఖర్చు చేస్తుంది. కారు ఎప్పుడూ సరైన కండిషన్లో ఉండి, ఇంజన్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే అవసరానికి అనుగుణంగా గేర్లను మార్చడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.
వెళుతున్న స్పీడ్‌ని బట్టి కారు గేర్లను(Car Gears) మారుస్తూ ఉండటం అత్యావస్యకం. కారు ట్రాఫిక్‌లో మెల్లగా కదులుతోంది అనుకుందాం. అప్పుడు మొదటి గేర్‌లో ఉంటే సరిపోతుంది. అలాగే కారును అప్పుడే స్టార్ట్ చేసిన సందర్భంలోనూ ఇలా మొదటి గేర్‌లోనే ఉండాలి. మొదటి మూడు గేర్లను కారును యాక్సిలరేట్ చేసేందుకు ఉపయోగించాలి. దాని వేగం కాస్త పుంజుకున్న తర్వాత టాప్ స్పీడ్‌కి వెళ్లాలని అనుకున్నప్పుడు మాత్రం 4,5,6 గేర్లను వాడాలని నిపుణులు చెబుతున్నారు.
టర్న్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మలుపుల దగ్గరకు వెళుతున్నప్పుడు ఒక్కసారిగా టాప్ స్పీడ్ నుంచి లో స్పీడ్‌కి వచ్చేయకూడదు. వరుగా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అలాగే గేర్లను సున్నితంగా మార్చాలి. గట్టిగా మారిస్తే ఇంజన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంజన్ సౌండ్‌ని అర్థం చేసుకుంటూ గేర్లు వేస్తూ ఉండాలి. 10 నుంచి 20 కిలోమీర్ల వేగంలో ఉన్నప్పుడు రెండో గేర్, 20 నుంచి 35 కిలోమీటర్ల వేగంలో ఉన్నప్పుడు మూడో గేర్, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంలో ఉన్నప్పుడు నాలుగో గేర్ వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.