ఓ మహిళ 21 ఏళ్ల వ్యవధిలో 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు తన పిల్లలను ఆమె పరిచయం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌లో తమ పిల్లలు ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ వయసులో తాను వారికి జన్మనిచ్చింది అనే వివరాలు చెప్పింది. 1996లో 20 ఏళ్ల వయసులో తాను మొదటిగా కూతురుకు జన్మనిచ్చినట్లు ఆమె చెప్పింది. ఆపై వీడియోలో వరుసగా తన పిల్లలను చూపించింది. చివరిగా తాను 42 ఏళ్ల వయసులో 2017లో చిన్న కూతురుకి జన్మనిచ్చింది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.