పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కు స్థానిక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిషేధం విధించింది. సంగతి తెలిసిందే తాజాగా తోషాఖానా కేసు(Case of Toshakhana)లో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) అక్కడి అటక్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు జైల్లో (Jail) ప్రత్యేకంగా ఎటువంటి సదుపాయాలు కల్పించలేదని తెలుస్తోంది.చిన్న చీకటి రూంలో ఇమ్రాన్‌ను ఉంచారని అందులోనూ చీమలు, ఈగలు ఉన్నట్లు సమాచారం.బాత్రూమ్ కూడా అందులోనే ఉందని.. ఎవరినీ కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఇమ్రాన్ వర్గీయులు ఆరోపించారు.
అయితే, లోపల ఇలా ఉన్నా.. జైలు బయట మాత్రం భారీ భద్రత కల్పించడం గమనార్హం.ఓ చిన్న చీకటి గదిలో ఉంచారు. టీవీ, న్యూస్ పేపర్ లేదు. అందులోనే వాష్‌రూమ్ (Wash room) ఉంది. కనీస సౌకర్యాలు లేవు. నన్నో ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ.. నా మిగతా జీవితం మొత్తం జైల్లోనే ఉండేందుకు సిద్ధం’ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది తెలిపారు.మరోవైపు అటక్ జైల్లో ఉన్న తమ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను అదియాలా జైలుకు మార్చాలని.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ సభ్యులు ఇస్లామాబాద్ (Islamabad) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన.. ఉన్నత చదువు, సామాజిక, రాజకీయ హోదాతో మెరుగైన జీవన విధానానికి అలవాటు పడ్డారని అన్నారు.