»World Heart Day 2023 September 29th 1 8 Crore People Die Every Year
World Heart Day: వరల్డ్ హార్ట్ డే..ఏటా 2 కోట్ల మంది మృతి?
నేడు (సెప్టెంబర్ 29) వరల్డ్ హార్ట్ డే(World Heart Day). దీని ప్రధాన ఉద్దేశం గుండె పనితీరు, హృదయ సంబంధ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. హృదయ సంబంధ వ్యాధులతో ఏటా దాదాపు రెండు కోట్ల మంది మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
World Heart Day 2023 september 29th 1.8 crore people die every year
ఈరోజు వరల్డ్ హార్ట్ డే(World Heart Day). దీనిని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 29న జరుపుకునే వార్షిక కార్యక్రమం. అయితే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ వారి హృదయం, అందుకు సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవాలని గుర్తు చేసే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు నివారించడానికి, నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలని ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు చేస్తుంది.
గుండె మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అది సరిగ్గా పనిచేయకపోయకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జీవనశైలి అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఇటివల కాలంలో కరోనా వ్యాధి వచ్చిన తర్వాత గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. చిన్న వయస్సులోనే అనేక మంది మృత్యువాత చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1.8 కోట్ల మంది మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం ప్రపంచ మరణాలలో దాదాపు 31% మంది అంటే ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే పొగాకు వాడకం, కలుషిత ఆహారం, స్తోమతకు మించిన పనులు చేయడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, ఉప్పు, చక్కెర తగ్గించడం వంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు శారీరక శ్రమ కల్గిన పనులు, వ్యాయామం, వాక్‌థాన్‌లు, సైక్లింగ్ చేయాలని అంటున్నారు. ఇలాంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా కనీసం 80% మంది గుండె జబ్బులు, స్ట్రోక్‌ల వల్ల సంభవించే అకాల మరణాలను నివారించవచ్చని చెబుతున్నారు. దీంతోపాటు ప్రతి నెల గుండెకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.