లియో మొదటి సింగిల్ ప్రకటన గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. విజయ్(vijay) పుట్టినరోజు జూన్ 22న ఇది రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ చిత్ర డైరెక్టర్ ట్విట్ చేయగా..నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నటీనటులు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ లిస్టులో హీరో రామ్ పోతినేని(ram pothineni) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై హీరో మామ క్లారిటీ ఇచ్చారు.
హీరో విజయ్ దేవరకొండ పరశురామ్ ప్రాజెక్ట్ టైటిల్ ఖారారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరశురామ్‌తో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ రెండు రోజుల క్రితం స్టైల్‌గా ప్రారంభించబడింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
వరుణ్ ధావన్ సమంతను పెళ్లి చేసుకోబోతున్నారా అంటే ఔననే అంటోంది బాలీవుడ్ మీడియా. సమంతను మ్యారేజ్ చేసుకునేందుకే వరుణ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం 'వార్2(War 2)'. ఈ క్రమంలో నటి కియారా అద్వానీ ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఖరారైనట్లు సమాచారం.
ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.95 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆదిపురుష్ సినిమాకు వానరం వచ్చింది. థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుండగా వానరం రావడంతో ప్రేక్షకులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మూవీ సీన్ లీక్ అయ్యిందని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. గతంలో ముంబై విమానాశ్రయంలో ధనుష్ తన దృఢమైన వ్యక్తిత్వంతో ఉన్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం ఫ్రాంచైజీకి రెండు అదనపు సీక్వెల్స్ ఉన్నాయని తెలుస్తోంది.
మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని మోసానికి పాల్పడడంతో సువర్ణభూమి(Suvarnabhumi) రియల్ ఎస్టేట్ సంస్థ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) రైతుగా మారబోతున్నారు. కొంపదీసి సినిమాలు వదిలేసి, ఆయన వ్యవసాయం చేయాలని అనుకుంటన్నారా అని పొరపాటు పడకండి. తన కొత్త సినిమా కోసం ఆయన రైతు పాత్ర పోషించనున్నారు.
ఓ మహిళ కారణంగా బాలీవుడ్ నటుడు దారుణానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లైవ్ సెషన్‌లో పురుగుల మంది సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తెలుసుకున్న అతని స్నేహితులు అతని ఇంటికి వచ్చిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రముఖ మొబైల్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండగా, రాజమౌళి నటించిన ప్రకటన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అభిమానులలో సంచలనం సృష్టిస్తోంది.
కళ్యాణ్ రామ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ బింబిసారతో సృష్టించిన సంచలనం తర్వాత డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో చిరంజీవి- వశిష్ఠ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హీరోయిన్ కాజల్(Kajal). ఈ అమ్మడు చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ భామ సినిమాలకు గుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.