సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2023) 11వ ఎడిషన్ ఎట్టకేలకు నిన్న(సెప్టెంబర్ 15న) తిరిగి దుబాయ్లో ప్రారంభమైంది. ఈ వేడుకలో సౌత్ నుంచి పలువురు నటీనటులు పాల్గొన్నారు. అయితే రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. నేడు తమిళ్, మలయాళ చిత్రాల అవార్డులను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి హాజరైన నటీనటుల చిత్రాలను ఇప్పుడు చుద్దాం.