ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. కెజియఫ్ ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది.ఆ తర్వాతే కాస్త తేడా కొట్టేసింది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయ్యింది. ఇస్రో మరో గొప్ప ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడిపైకి వెళ్లేందుకు ‘ఆదిత్య-L1’ పేరుతో సోలార్ మిషన్‌ని సిద్ధం చేస్తోంది. ‘ఆదిత్య-L1’ను శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11:50 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్ అయితే సూర్యుడిపై అధ్యయనం చేయడానికి శాటిలైట్‌ను పంపిన తొలి దేశంగా భారతీయ ఇస్రో చరిత్ర సృష్టిస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎలాంటి పాత్ర అయినా అలవోగా చేయాలంటే కీర్తి తర్వాతే. మహానటి సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక కీర్తి ఓ వైపు హీరోల సరసన నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఓనమ్ సందర్భంగా చీరకట్టులో దిగిన చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ఈరోజు రాఖీ పండుగ. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు, వారి సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీంతోపాటు వారి అరుదైన ఫోటోలను కూడా ఇక్కడ చూసేద్దాం.
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, శ్రీలీల కాంబోలో వస్తోన్న సినిమా స్కంద. బోయపాటి శ్రీను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. బోయపాటి స్పెషల్ ఫైట్స్ కు తోడు థమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించినట్లు హీరో రామ్ తెలిపారు. స్కంద మూవీ సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
నాలుగు పదుల వయసులో కూడా వన్నే తగ్గని అందంతో అభిమానుల మతి పోగొడుతున్న ద సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్ ప్రస్తుతం సినిమాల వేగం పెంచింది. వరుస సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా తాను పోస్ట్ చేసిన చిత్రాలను ఇప్పుడు చుద్దాం,
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బన్నీకి అవార్డు లభించింది. పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీలో సంబరాలు జరిగాయి. మెగాహీరోలు అల్లు అర్జున్‌ని కలిసి అభినందనలు తెలిపారు. హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబులు బన్నీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
క్యూట్ లుక్స్‌తో నటి ప్రజ్ఞా నగ్రా యూత్‌ను టెంప్ట్ చేస్తోంది. తన కొత్త ఫోటోలను ఇన్ స్టలో అప్ లోడ్ చేసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఈ మూవీకి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. గాండీవధారి అర్జున సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతి ఏటా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. న్యూయార్క్‌లో జరిగిన 41వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. తాజాగా సామ్ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు రాయల్ లుక్ లో కనిపించింది. సమంత చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లు ఉన్నారు. ప్రస్తుతం సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శరత్ కటారియా దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ దమ్ లగా కే హైషా ద్వారా 2015లో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది భూమి పెడ్నేకర్.
రెబల్ స్టార్ హీరో ప్రభాస్(prabhas) నటించిన సలార్ మూవీ(sallar movie) రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ట్విట్టర్లో ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ ఐమాక్స్ సహా ఇతర పెద్ద ఫార్మాట్లలో ప్రీమియర్ షోల కోసం ఆగస్టు 25న బుకింగ్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన కింగ్ ఆఫ్ కోతా చిత్రంలో ఈ అమ్మడ్ మెయిన్ రోల్ క్యారెక్టర్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ భామ ఏ చిత్రంలో ఫేమస్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా పూజా హెగ్డే పేరే వినపడేది. మొన్నటి వరకు ఆమె జోరు అలా సాగింది. ఇప్పుడే కాస్త డల్ అయ్యింది. రెండు, మూడు సినిమాల ఛాన్సులు చేతుల వరకు వచ్చి చేజారాయి. కానీ లేకుంటే మరో రెండు ఏళ్లు పూజాకి తిరుగు ఉండేది కాదు.
హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం(Brahmanandam). ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ(Siddharth) నిన్న(august 18th) ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్లు వేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.