నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా పూజా హెగ్డే పేరే వినపడేది. మొన్నటి వరకు ఆమె జోరు అలా సాగింది. ఇప్పుడే కాస్త డల్ అయ్యింది. రెండు, మూడు సినిమాల ఛాన్సులు చేతుల వరకు వచ్చి చేజారాయి. కానీ లేకుంటే మరో రెండు ఏళ్లు పూజాకి తిరుగు ఉండేది కాదు.
ప్రస్తుతం పూజా హెగ్డే పూజా చేతిలో తెలుగులో ఎలాంటి సినిమాలు లేవు. అయినా, ఫ్యాన్స్ బాధపడకుండా ఉండేందుకు సోషల్ మీడియా ద్వారా మాత్రం అలరిస్తూనే ఉంది.
తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చింది. పూజాకి బికీనీ ట్రీట్ ఇవ్వడంలో పూజా ఎప్పుడూ ముందుంటుంది. కానీ, ఈ మధ్య కాస్త తగ్గించింది.
చాలా కాలం తర్వాత ఆమె బికినీలో కనిపించడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా, వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో పూజ తెలుగు తెరుకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసంలో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు.
మొదట్లో అందరూ బ్యాడ్ లక్ అనుకున్నారు. కానీ, తర్వాతే తాను అందరికీ గోల్డెన్ లెగ్ మారిపోయింది.
రెండు వరస ప్లాప్ ల తర్వాత ఆమెకు అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది. కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ముంబయికి చెక్కేసింది.
ఇక టాలీవుడ్ లో పూజ కెరీర్ అయిపోయినట్లే అనుకునే సమయంలో ఆమెకు అలవైకుంఠ పురంతో హిట్ పడింది.
అంతే, అక్కడి నుంచి పూజ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి.
దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన ఆమే నటించింది. యువ హీరోయిన్లు ఎంత మంది వచ్చినా, పూజా స్థానాన్ని చేరుకోలేకపోయారు.
కానీ, ఇటీవల కొన్ని కారణాల వల్ల ఆమె రెండు పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం గమనార్హం. మళ్లీ, కొత్త ఏ సినిమా సంతకం చేసినట్లు సమాచారం లేదు.