Trisha Krishnan: త్రిష వయసు పెరుగుతున్నా..తరగని అందాలు!
నాలుగు పదుల వయసులో కూడా వన్నే తగ్గని అందంతో అభిమానుల మతి పోగొడుతున్న ద సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్ ప్రస్తుతం సినిమాల వేగం పెంచింది. వరుస సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా తాను పోస్ట్ చేసిన చిత్రాలను ఇప్పుడు చుద్దాం,
Trisha Krishnan: అప్పుడెప్పుడో వర్షం సినిమాతో 2005లో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అందాల భామ ఇప్పటికి వెండితెరమీద అదే గ్రేస్‌తో, అంతకు మించిన స్టార్గమ్తో రాణిస్తుందంటే మాములు విషయం కాదు. ఈ మధ్య విడుదలైన పీఎస్-1, పీఎస్-2 సినిమాలో అమ్మడి స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే అందం తింటుందేమో అనే అనుమానం కలుగుతోంది.
ప్రస్తుతం తమిళ తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లియో సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మూవీలవర్స్‌కు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో త్రిష ఎలా కనిపించబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆ మధ్య త్రిషకు సరైన హిట్ లేక ఇబ్బంది పడింది. అడపాదడపా సినిమాల్లో కనిపించడమే గగనం అయిన సమయంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో తన లక్ పరిక్షించుకుంది. కానీ ఆ సినిమాలేవి అనుకున్నంతగా ఆడలేదు. దీంతో బ్యూటీ కెరియర్ ముగిసింది అన్న వార్తలు వచ్చాయి.
20 ఏళ్లుగా వెండితెర మీద స్టార్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ జోడి కట్టింది త్రిష. ఇక కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో 96 సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ… ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.
లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో పొన్నియిన్ సెల్వన్‌తో మెరిసింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ త్రిష గ్లామర్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ బ్యూటీతో జోడికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
గతంలో కిరీడం, మంగాత్త, ఎంతవాడుగానీ సినిమాల్లో కలిసి అజిత్, త్రిష నటించారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని వారు నమ్మకంగా ఉన్నారు.
త్రిష కృష్ణన్ 4 మే 1983 లో చెన్నైలో జన్మించింది. తాను ఇండస్ట్రీకి రాకముందు మోడల్‌గా రాణించింది. 1999 మిస్ చెన్నై పోటీని గెలుచుకున్న తర్వాత ఆమె నేరుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
ద సౌత్ క్వీన్‌గా పిలువబడే ఈ హీరోయిన్ కోల్గేట్, క్లోజప్, లక్స్ లాంటి పలు కంపెనీలకు అంబాసీడర్‌గా పనిచేసింది.