»Varun Tej And Lavanya Old Photo Shared For The First Time After Engagement
Varun-Lavanya: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారిగా పిక్ షేర్..వీళ్ల ప్రేమ అప్పడే మొదలైందా?
టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Varun tej Lavanya)లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా, వారు స్పందించలేదు. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి వారి ప్రేమను తెలియజేశారు.
హీరోహీరోయిన్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి(Varun tej and Lavanya) ఎంగేజ్మెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. అయితే ఈ క్రమంలో తాజాగా తనకు తన ప్రేమ దొరికింది అంటూ వరుణ్ క్యాప్షన్ పెట్టగా, తమ ప్రేమ 2016లోనే మొదలైందని లావణ్య పేర్కొంది. చివరి వరకు ఉంటుందని అంటూ లావణ్య క్యాప్షన్ పెట్టి ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీళ్లు ఎంగేజ్మెంట్ అయ్యే వరకు తమ ప్రేమను ఎక్కడా బయటపెట్టకపోవడం విశేషం. కనీసం బయట తిరగడం, కెమేరాకు చిక్కడం లాంటివి కూడా ఎన్నడూ జరగలేదు. తాజాగా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మొదటిసారి తమ ప్రైవేట్ ఫోటోని షేర్ చేసింది.
లావణ్య త్రిపాఠి తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న స్టిల్(photo still)ను వరుణ్ తేజ్ షేర్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. అని క్యాప్షన్ ఇచ్చాడు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసిన మొదటి వెకేషన్ స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుండగా..ఇంతకీ ఈ ఇద్దరు హాలీడే స్పాట్‌కు ఎక్కడికెళ్లారనేది తెలియాల్సి ఉంది.
కాగా, వరుణ్, లావణ్యలకు మిస్టర్ మూవీ(mister movie) సమయంలో పరిచయం ఏర్పడింది. 2016లో తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇక లావణ్య ఉత్తరప్రదేశ్ కి చెందిన యువతి కాగా, అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవదారి అర్జున’. మరొకటి ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు.