ప్రభాస్ అన్‌స్టాపబుల్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకే సారి లక్షల మంది ఆహా యాప్ మీద పడడంతో.. ఆ బరువును ఆహా భరించలేకపోయింది.. అందుకే కాస్త లేట్‌గా స్ట్రీమింగ్ అయింది ప్రభాస్, బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యాక సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అలాగే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభాస్ మేనియాతో ఊగిపోతోంది. ప్రభాస్ పెళ్లి.. బాలయ్య, చరణ్ ఫోన్ కన్వర్జేషన్.. బాలయ్య మేడం పేరంటని అడగడం.. ఇలా ఒక్కటని కాదు.. ఈ ఎపిసోడ్ మొత్తం అంతకుమించి ఎంటర్టైన్ చేసింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. ఇది ప్రభాస్ రేంజ్ అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక అనుకున్నట్టే ప్రభాస్ ఎపిసోడ్ ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో ప్రభాస్, బాలయ్య రికార్డులు సృష్టించారు. కేవలం 12 గంటల్లోనే ప్రభాస్ ఎపిసోడ్ 50 మిలియన్ మినిట్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇతర భాషల్లోను ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కావాలని కోరడంతో.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మిగతా భాషలోని ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్‌ని వీక్షించారు. అందుకే 50 మిలియన్ మార్క్‌ని సులువుగా అందుకుంది. ఇదే కాదు 24 గంటల్లో ఈ షో ఓటిటి రికార్డులను తిరగరాయడం పక్కా అంటున్నారు. అయితే ఫస్ట్ ఎపిసోడే ఇలా ఉంటే.. జనవరి 6న రిలీజ్ కానున్న పార్ట్-2 మరిన్ని రికార్డులను తిరగ రాసేలా ఉందంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మరి బాహుబలిలాగా సెకండ్ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.