»Tamil Serial Actress Rachitha Mahalakshmi Filed A Police Complaint Against Her Husband
Rachitha Mahalakshmi: భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
అసభ్యకర మేసేజులు చేస్తున్నాడని రాత్రికి రాత్రే సీరియల్ నటి రచిత మహాలక్ష్మి(Rachitha Mahalakshmi) తన భర్త దినేష్ కార్తీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
‘బిగ్ బాస్ తమిళ్ 6’ ఫేమ్ నటి రచిత మహాలక్ష్మి(Rachitha Mahalakshmi )తన భర్తతో విడిపోయిన తర్వాత తాజాగా నిన్న రాత్రి దినేష్ గోపాలస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసి షాక్ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన రచిత 2011లో విజయ్ టీవీలో ప్రసారమైన ‘పిరివోం సందిపోమ్’ సీరియల్లో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆ క్రమంలో ఆమె పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా తన కోస్టార్ దినేష్ గోపాలస్వామితో ప్రేమలో పడింది. ఈ జంటకు 2013లో వివాహమైంది. కానీ పిల్లలు లేరు. అయితే అపార్థాల తరువాత రచిత, దినేష్ విడిపోయారు. ఆ తర్వాత నటి ‘బిగ్ బాస్ తమిళ్ 6లో అదే విషయాన్ని వెల్లడించింది.
విబేధాల కారణంగా రచిత ఇప్పటికే తన భర్త(husband) నుంచి విడిపోయినందున, ఈ షో తర్వాత వారు తిరిగి కలిసిపోతారని అభిమానులు ఆశించారు. అందుకు కారణం రచిత బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఆమె భర్త ఆమెకు సపోర్ట్‌గా ఉండేవాడు. దాంతో రచిత తన భర్తను అర్థం చేసుకుని సహజీవనం చేస్తుందని చాలా మంది ఊహించారు. కానీ తన భార్యతో ఉన్న సమస్యలను సమయం పరిష్కరిస్తుందని త్వరలో వారు తిరిగి కలుస్తారని వివిధ ఇంటర్వ్యూలలో దినేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా రచిత పాత పరిస్థితిలోనే ఉంది. అతడి జీవితంలో ఎలాంటి మార్పు లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రచిత సపోర్ట్ చేయకపోవడంతో ఆమె భర్త దినేష్ విడాకుల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి రచిత మంగాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అందులో తన భర్త దినేష్ తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడని, సెల్ ఫోన్(mobile) లో బెదిరిస్తున్నాడని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరిని విచారిస్తున్నారు.