విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎప్పుడూ హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి నిత్యం ఏదో ఓ వార్త వస్తునే ఉంటుంది. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతున్నా.. పీకల్లోతు ప్రేమలో ఉన్నారనేది సోషల్ మీడియా టాక్. మాల్దివ్స్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. వీడియోలో రౌడీ వాయిస్ లీక్ అయింది. అయితే ఫ్రెండ్‌తో వెకేషన్‌కి వెళ్లకూడదా.. అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మిక. ఒక్క మాల్దీవ్స్ అని మాత్రమే కాదు.. గతంలో చాలా సార్లు ఈ ఇద్దరు వెకేషన్‌కి వెళ్లి కెమెరా కంట పడని సందర్భాలున్నాయి. ఇక ఇప్పుడు మళ్లీ ఫుల్లుగా షికారు చేస్తున్నారు. విజయ్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు. తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వీధుల్లో, ఎడారిలో ఫొటోలకు పోజులిచ్చాడు. అయితే ఈ ఫొటోలతోపాటు మరో ఫొటో కూడా బయటకు వచ్చింది. ఓ అభిమాని ట్విటర్ ద్వారా దుబాయ్‌లో విజయ్, రష్మిక కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాకపోతే ఆ ఫోటో దూరం నుంచి తీసినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో మళ్లీ దొరికిపోయారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తున్నఈ జంట.. ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ అని కొట్టిపారేస్తున్నారు. కానీ లీక్డ్ ఫోటోలు మాత్రం డేటింగ్లో ఉన్నారని చెబుతున్నాయి. కాబట్టి ఇద్దరు ఎప్పుడు ఓపెన్ అవుతారనేది వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. రష్మిక ‘పుష్ప2’ చేస్తోంది. అయితే ఈ ఇద్దరు కలిసి గీతాగోవిందం మూవీ సీక్వెల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రౌడీ, రష్మిక డేటింగ్ ఉన్నారనేది నమ్మలేని నిజమే.