అభిమానుల తాకిడిని తట్టుకోవడం సెలబ్రిటీలకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫ్యాన్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా పబ్లిక్ ఈవెంట్, షాప్ ఓపెనింగ్స్‌కు వెళ్లి.. ఒకవేళ జనంలో ఇరుక్కుంటే మాత్రం.. ఇక అంతే సంగతులు. ఈ మధ్య కొందరు ముద్దుగుమ్మలకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అంతేకాదు ఫ్యాన్స్ చేష్టలకు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మందనకు కూడా ఓ వింత ఘటన ఎదురైంది. ప్రస్తుతం రష్మిక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన ‘వారిసు’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఈ సినిమా ‘వారసుడు’గా రాబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా.. సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవలే వారిసు ప్రీరిలీజ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ కార్యక్రమం తర్వాత రాత్రి తిరిగి వెళ్తుంటే.. కొంత మంది అభిమానులు.. రష్మిక కారును బైక్ పై వెంబడించారు. అది గమనించిన బ్యూటీ.. వాళ్ల అభిమానానికి పడిపోయింది. కాకపోతే.. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు.. ఇప్పుడే పెట్టుకోండని ఫైర్ అయింది. ఆ వీడియోని రష్మిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది. ఇక రష్మిక ఫ్యాన్స్‌కు ఇచ్చిన రిప్లే చూసి.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కొందరు రష్మిక వార్నింగ్ సూపర్ అంటుండగా.. ఇంకొందరు ఇంకాస్త గట్టిగా ఇవ్వాల్సిందని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రజెంట్ రష్మిక ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉందని చెప్పొచ్చు.