దర్శకుడు తేజ తనకు దేవుడు అని దగ్గుబాటి అభిరామ్ అన్నారు. తేజ దర్శకత్వంలో వస్తోన్న అహింస మూవీతో అభిరామ్ తెరంగ్రేటం చేస్తున్నారు. మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు.
చిన్న సినిమానా? పెద్ద సినిమా? అనేది పక్కన పెడితే.. మహేష్ బాబు, రాజమౌళికి సినిమా నచ్చితే చాలు.. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో వీళ్లు ముందు వరుసలో ఉంటారు. మేమ్ ఫేమస్ విషయంలోను ఇదే చేశారు మహేష్, రాజమౌళి.. కానీ దీని వెనక లెక్క వేరే ఉందనే కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
'బడ్డీ' అనే మూవీ(Buddy Movie) ద్వారా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేయడానికి అల్లు శిరీష్(Allu sirish) రెడీ అయ్యాడు. తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ అప్పుడే ఏకంగా ఏడెనిమిది సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ క్యూట్ పిల్ల. అది కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. అందుకే ఇక పై అమ్మడిని టచ్ చేయడం కష్టమే అంటున్నారు.
ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది.
సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ ఇంగ్లీష్‌కు రీమెక్ కాదు.. ప్రీక్వెల్. సిటాడెల్ ఇంగ్లీష్ సిరీస్ ప్రియాంక తండ్రి పాత్రకు వరుణ్ ధావన్ డబ్బింగ్ చెప్పడంతో ప్రీక్వెల్ అని ఖరారు అయ్యింది.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. కానీ గత కొన్నాళ్లుగా రేసులో వెనకబడిపోయాడు ఈయన. తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా అఖండ మేకర్స్‌తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మరి శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ హీరో ఎవరు?
గంగూలీ బయోపిక్ తెరకెక్కించే బాధ్యత ఐశ్వర్య రజనీకాంత్ చేతికి వచ్చింది. ఆమె తీసిన ఒక్క మూవీ హిట్ కాలేదని.. ఫ్లాప్ డైరెక్టర్ అని గంగూలీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
గత రెండు మూడు రోజులుగా ప్రభాస్, రామ్ చరణ్ గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా తమ తమ బడా సంస్థలను పక్కకు పెట్టేశారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ప్రభాస్, చరణ్ తమ సొంత బ్యానర్లను నిజంగానే పక్కకు పెట్టేశారా?
అఖండ, వీరసింహారెడ్డి వంటి బస్టర్ హిట్స్‌తో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. ఈ మధ్యలో అన్‌స్టాపబుల్ షోతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో టాక్ షో చేసి రికార్డులు క్రియేట్ చేశారు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.