NTR : ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ లిస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికాలోనే ఉంది. రీసెంట్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. మార్చి 12న జరగనున్న ఆస్కార్ వేడుకలో పాల్గొనబోతున్నాడు.
ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ లిస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికాలోనే ఉంది. రీసెంట్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. మార్చి 12న జరగనున్న ఆస్కార్ వేడుకలో పాల్గొనబోతున్నాడు. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి.. ఈలోపు ఓవర్సీస్ ఫ్యాన్స్‌తో రచ్చ చేస్తున్నాడు తారక్. అక్కడ ఫ్యాన్స్‌ను మీట్ అవుతూ.. ఎమోషనల్ అవుతున్నాడు. వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ఇస్తున్నాడు. ‘రక్తసంబంధం కన్నా మీదే పెద్ద అనుబంధం.. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరుకుంటున్నాని..’ వాళ్ల పై ప్రేమను కురిపిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు తారక్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాన్స్ మీట్‌ని పెట్టలేదు. ఈవెంట్స్‌లో కలవడం తప్పా.. నేరుగా ఎన్నడూ అభిమానులని కలిసిన సందర్భాలు లేవు. కానీ ఫారిన్ ఫాన్స్‌తో మాత్రం ఇంటరాక్ట్ అవుతూ.. ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలకకు కారణమైంది. వాళ్ళకేమో ఫోటో సెషన్లు.. మాకేమో ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్లాస్లా.. అంటూ సోషల్ మీడియాలో వాపోతున్నారు. ముఖ్యంగా అమిగోస్ ప్రీరిలీజ్ వేడుకలో తారక్ క్లాస్ ఇచ్చిన వైనాన్ని గుర్తు చేస్తు.. అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లదే అభిమానం.. మాది కాదా అని ఫీల్ అవుతున్నారు. దీంతో ఫారిన్లో ఎన్టీఆర్ చేస్తున్న పనికి.. ఇక్కడి ఫ్యాన్స్ కాస్త గట్టిగానే హర్ట్ అయినట్టున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎన్టీఆర్ ఇక్కడ కూడా ఫోటో సెషన్స్ ఏర్పాటు చేస్తాడేమో చూడాలి. అయితే అది సాధ్యమయ్యే పని కాదు. ఫారిన్లో అంటే ఫ్యాన్స్ తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది. కానీ తెలుగులో మాత్ర దాన్ని తట్టుకోవడం కష్టమే. ఇటీవల వైజాగ్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. అయినా తారక్ ఫ్యాన్స్‌కు కూల్ చేస్తాడేమో చూడాలి.