Last Stories2: లస్ట్ పదానికి కాజోల్ సరికొత్త మీనింగ్
లస్ట్ స్టోరీస్-2 షార్మ్ ఫిల్మ్ ఈ గురువారం నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లస్ట్ అనే పదంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. లస్ట్ అనే పదానికి సీనియర్ నటి కాజోల్ సమాధానం ఇచ్చారు.
Last Stories-2: లస్ట్ స్టోరీస్-2 (Last Stories-2) మూవీ గురువారం నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమ్ అవనుంది. లస్ట్ స్టోరీస్‌కు (Last Stories) ఇదీ సిక్వెల్. మరో రెండు భాగాలుగా కూడా లస్ట్ స్టోరీస్ రానుంది. కామం, మోహం, కోరిక నేపథ్యంలో షార్ట్ కొనసాగుతోంది. ఆ మూవీ గురించిన విశేషాలను మీడియాతో మాట్లాడారు సీనియర్ నటి కాజోల్ (kajol).
నాలుగు భాగాలుగా వస్తోన్న మూవీస్‌ను అమిత్ ఆర్ శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్, కొంకణా సేన్ శర్మ తెరకెక్కిస్తున్నారు. లస్ట్ స్టోరీస్-2లో కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా భాటియా, విజయ్ వర్మ, కుముద్ మిశ్రా నటిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్‌ను ఆశిష్ దువా, రోనీ స్క్రూవాలా నిర్మించారు. షార్ట్ ఫిల్మ్‌కు లస్ట్ అనే పదం పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
లస్ట్ (last) అనే పదం గురించి కాజోల్‌ను మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కామం, మోహం, కోరిక.. ఇలా ఎవరికీ నచ్చినట్టు వారు లస్ట్‌కి అర్థం చెబుతారు. తన ఉద్దేశంలో లస్ట్ అంటే గాఢమైన కోరిక అని వివరించారు. ఏ విషయంలోనైనా సరే కావొచ్చు.. కోరిక గాఢంగా ఉంటుందని తెలిపారు. జీవితమే పెద్ద లస్ట్.. ఇష్టమైన ఫుడ్ తీసుకోవడం.. డ్యాన్స్ చేయడం, సంగీతం వినడం, కుట్లు అల్లికలు. ఇవన్నీ తన లస్ట్లేనని తెలిపారు. పిల్లలతో కలిసి ప్రతీక్షణం ఆస్వాదించడం ఆ కోవలోకి వస్తుందని ఆమె వివరించారు.