»%f0%9d%90%8f%f0%9d%90%ab%f0%9d%90%a8%f0%9d%90%a3%f0%9d%90%9e%f0%9d%90%9c%f0%9d%90%ad %f0%9d%90%8a Release Date Announced
Prabhas : 𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐊 రిలీజ్ డేట్ అనౌన్స్!
Prabhas : బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ వరుసగా ఫ్లాప్ అందుకోవడంతో.. ఒక్క హిట్ కావాలంటూ తహతహలాడిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాంటిది.. ప్రభాస్ నుంచి ఆరు నెలల్లో మూడు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లోకి వస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ వరుసగా ఫ్లాప్ అందుకోవడంతో.. ఒక్క హిట్ కావాలంటూ తహతహలాడిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాంటిది.. ప్రభాస్ నుంచి ఆరు నెలల్లో మూడు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లోకి వస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు. మూడు నెలల గ్యాప్‌తో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ముందుగా ‘ఆదిపురుష్’ జూన్ 16న థియేర్లోకి రాబోతోంది. ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. దేశ గర్వించదగ్గ సినిమా అవుతుందని అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’.. సెప్టెంబర్ 28న రాబోతోంది. అయితే ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో మాత్రమే వస్తున్నాయి. కానీ ‘ప్రాజెక్ట్ కె’ మాత్రం పాన్ వరల్డ్ రేంజ్లో రాబోతోంది. అసలు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. 500 కోట్ల బడ్జెట్‌తో టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నట్టు మాత్రమే తెలుసు. కానీ ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంలో.. ఒక చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సినిమా పై మరింత ఆసక్తిని పెంచేశాడు నాగ్ అశ్విన్. మహాశివరాత్రి కానుకగా ప్రాజెక్ట్ కెని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా, జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. ఒక పెద్ద చేయి, దానిని టార్గెట్ చేస్తూ ముగ్గురు వ్యక్తులు.. చుట్టు పక్కల పెద్ద పెద్ద మిషన్లు, మోడ్రన్ గన్స్ ఉన్నాయి. ఇదంత చూసి.. నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్లో ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మొత్తంగా ఒక్క పోస్టర్‌తో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్.