»Prem Kumar Movie Team Exclusive Interview Santosh Sobhan Ruchitha Abhishek
Santosh Sobhan: నా నెక్ట్స్ సినిమాల్లో పెళ్లి సీన్లు చేయను
పేపర్ బాయ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన హీరో సంతోష్ శోభన్ తాజాగా ప్రేమ్ కుమార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సరైన సినిమా పడటం లేదు. ఈ నేపథ్యంలో తన మనసులోని మాటలను హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Prem Kumar Movie Team Exclusive Interview Santosh Sobhan, Ruchitha, Abhishek
Santosh Sobhan: సంతోష్ శోభన్ హీరోగా నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, శ్రీదేవి శోభన్‌బాబు, అన్ని మంచి శకునములే చిత్రాలు బాక్సాఫీసు పెద్దగా ఆడలేదు. తాజాగా నిన్న(ఆగస్టు 18న) విడుదలైన ప్రేమ కుమార్(Prem kumar) సినిమా మిశ్రమ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. అయితే ఆయన నటించిన అన్ని సినిమాల్లో పెళ్లి సీన్లు ఉంటున్నాయని, ఇకపై ఆ సీన్లు ఉంటే సినిమానే చేయను అంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి చర్చించారు. ప్రేమ్ కుమార్ సినిమాలో సంతోష్ శోభన్(Santosh Sobhan)కి జోడీగా రాశీ సింగ్, రుచిత(Ruchitha) సాధినేని హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో మోస్ట్ ఫన్నీథింగ్ ఏంటి, ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో, ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాలను చక్కగా వివరించారు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.