Jabardasth Naresh: అందరూ జబర్దస్త్ వదిలి వెళ్లడానికి కారణం అదేనా?
జబర్దస్త్ అనే కామెడీషో ద్వారా బుల్లితెరకు పరిచయమైన నరేష్ సక్సెస్ సీక్రెట్ ఏంటో, 9వ తరగతిలోనే చదువు ఎందుకు మానేయ్యాల్సిందో, తన లైఫ్‌లో జరిగిన అత్యంత సంతోషకరమైన విషయాల గురించి హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
Jabardasth Naresh: బుల్లి తెర హస్య నటుడిగా మంచి పేరు తెచ్చకున్న జబర్దస్త్ నరేష్(Jabardasth Naresh) తాను చదువు మానేసి టీవీ రంగంలోకి ఎందుకు, ఎలా అడుగుపెట్టాడో వివరించారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం బుల్లెట్ భాస్కర్(Bullet Bhaskar) అని అందరూ అంటుంటారు. కానీ ఆయన్ను పరిచయం చేసింది సుధాకర్ అని చెప్పారు. రెండు తలకాయల స్కిట్ చేసిన తరువాత తన జీవితం మారిపోయిందన్నారు. తనను అవమానించిన వారే దాని తరువాత అద్భుతంగా చూసేవారని తెలిపారు. బాగా కంఫర్ట్‌గా అనిపించే టీమ్ ఏంటో, ఈవెంట్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు తనను ఎలా చూస్తారో వెల్లడించారు.
అలాగే స్క్రిప్ట్‌లో ఉన్నదాన్ని మాత్రమే కాదు స్పాంటినీయస్గా మనం చేసేదాన్ని బట్టే మనకు పేరు వస్తుందని పేర్కొన్నారు. ఇక తన లైఫ్‌లో ఎలాంటి గర్ల్‌ఫ్రెండ్ కావాలో వివరించారు. తన లైఫ్‌లో గోల్ ఎంటో తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పారు. అలాగే చాలా మంది జబర్దస్త్‌ను ఎందుకు వదిలెయ్యాల్సి వచ్చిందో హిట్ టీవి(Hittv Telugu)తో ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇండస్ట్రిలో 90 శాతం నటీనటులను కలసి మాట్లాడడాని, కానీ ఒక నటుడిని కలువలేకపోయానన్నారు. అలాగే భోళా శంకర్(Bholashankar) సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చిందో చెప్పారు. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే పూర్తి ఇంటర్వ్యూ చూసేయండి.