Director Teja: అహింస మూవీలో 23 మంది కొత్త నటులను, ఓ సింగర్‌ను పరిచయం చేశామని డైరెక్టర్ తేజ (Director Teja) తెలిపారు. మూవీ షూటింగ్ 90 శాతం మధ్యప్రదేశ్‌లో 10 శాతం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని వివరించారు. మధ్యప్రదేశ్‌లో మహాభారత కాలంలో ఉన్న లొకేషన్లలో షూట్ జరిగిందన్నారు. భీమ్ కుండ్ లొకేషన్లో 40 కిలోమీటర్ల డెప్త్‌లో నీరు నీలం రంగులో ఉంటుందని వివరించారు. ద్రౌపది నీరు కావాలంటే భీముడు గదతో కొట్టి ఓపెన్ చేశాడని పురాణ గాధలు ఉన్నాయి. అలాగే బృహస్పతి కొండ మీద కూడా షూట్ జరిగిందన్నారు. లొకేషన్‌కు వెళ్లి, షూట్ చేయడం కష్టమని.. మూవీ చక్కగా వచ్చిందని తెలిపారు. మూవీకి సంబంధించి విషేశాలను హిట్ టీవీకి ప్రత్యేకంగా వివరించారు.
పన్నా టైగర్ రిజర్వ్ వద్ద షూటింగ్ జరిగిందన్నారు. అక్కడ పులులు తిరుగుతాయని, చెట్టు, పుట్ట ముట్టకుండా.. జాగ్రత్తగా షూటింగ్ చేశామని వివరించారు. తాము తీసిన లోకేషన్స్, కథకు సంబంధం లేదని.. అయినప్పటికీ మ్యాచ్ అయ్యిందని వివరించారు. కృష్ణ తత్వం, గాంధీ తత్వం మధ్య హీరో హీరోయిన్ల మధ్య గొడవ జరుగుతుందని.. దాని మీద సినిమా నడుస్తోందని తెలిపారు. శ్రీరెడ్డి గురించి హిట్ టీవీ ప్రతినిధి ప్రస్తావించగా.. తేజ సమాధానం ఇచ్చారు. కాస్టింగ్ కౌచ్ సమయంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పిన మాట నిజమేనని వివరించారు. తాను చేయాల్సిన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్నానని.. అందుకే ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయానని తెలిపారు. మాట ఇచ్చానని.. తర్వాత అవకాశం ఇస్తానని తెలిపారు.
అహింస కథ రాసుకున్నామని, మూవీకి అభిరామ్ సెట్ అవడంతో సినిమా తీశానని తేజ తెలిపారు. ఇద్దరు, ముగ్గురు నటులను అనుకున్నామని.. అభిరామ్ వర్కవుట్స్ చేస్తేనే మూవీ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కథలో కొత్తదనం ఉందని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన వద్దకు వస్తే మహానటుడు అయినా.. ఏమీ రానీ నటుడు అయినా రూట్లోకి రావాల్సిందేనని తేజ అంటున్నారు.