AP: లడ్డూ ప్రసాదం అపవిత్రంపై రేపు తిరుమలలో శాంతియాగం చేయనున్నారు. విమాన ప్రాకారం దగ్గర యాగశాలలో రేపు ఉదయం 6 గంటల నుంచి శాంతియాగం ప్రారంభంకానుంది. తర్వాత అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు. ఇందుకోసం మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఈ యాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొననున్నారు. దేవాదాయ శాఖ తరఫున అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.