Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి
అప్పు కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్థాన చలన సూచన ఉంది. శుభకార్యాల వల్ల ధన వ్యయం జరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తోంది.
వృషభ రాశి
శుభ కార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దూర బంధువులతో కలుస్తారు. దాంతో లాభం జరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు నెరవేరతాయి. ఆకస్మిక ధన లాభం ఉంది.
మిథున రాశి
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు.
కర్కాటక రాశి
మానసిక ఆనందం పొందుతారు. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తి అవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహ రాశి
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి.
కన్య రాశి
ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వల్ల శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల పట్టుదల పనికిరాదు.
తుల రాశి
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.
వృశ్చిక రాశి
స్త్రీల వల్ల లాభాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబం సౌఖ్యం లభిస్తోంది. సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు రాశి
ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడంతో ఆందోళన చెందుతారు. విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
మకర రాశి
బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది.
కుంభ రాశి
స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన పనులు వాయిదా వేసుకోకతప్పదు.
మీన రాశి
స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు.