»Horoscope Today Todays Horoscope 2024 March 9th Good Deeds Will Be Easily Accomplished
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 March 9th).. ధనలాభం ఉంది
ఈ రోజు(2024 March 9th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
అవసరానికి తగ్గ అప్పుడు పుడుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాల వల్ల ధనవ్యయం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడటం అవసరం.
వృషభం
శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర బంధువులతో కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
మిథునం
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కర్కాటకం
మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం
ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అకాల భోజనం వల్ల ఆరోగ్యం పాడౌతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి.
కన్య
బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
తుల
ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం
తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
ధనుస్సు
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
మకరం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు.
కుంభం
స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా మెలగాలి. మంచి అవకాశాన్ని కోల్పోతారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నూతనకార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.
మీనం
మీరు చేసే పనికి సంఘంలో గౌరవం వస్తుంది. కుటుంబ పరిస్థితుల వలన మానసిక ఆందోళన చెందుతారు. చేసే పని ఆలస్యంగా పూర్తి అవుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.