Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 26th)..శుభవార్తలు వింటారు.
ఈ రోజు(2024 April 26th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
సమాజంలో పలుకుబడి పెరుగి మంచిస్థాయిలో నిలుస్తారు. డబ్బు చేతికి అందుతుంది. మీమీ రంగాల్లో సంతృప్తికరంగా ఉంటారు. మొదలు పెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. వ్యాపారులకు అదృష్టం ఉంది.
వృషభం
నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులతో వాధించకపోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.
మిథునం
అనారోగ్య సమస్యలు ఉండవు. అదృష్టం కలిసివస్తుంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవడం మంచిది.
కర్కాటకం
స్నేహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. నలుగురికీ సాయంగా ఉంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిభను నిరూపించుకునే సమయం వస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
సింహం
కొత్త వ్యాపారం మొదలుపెడుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక పనులు సమస్యగా మారుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఖర్చులు పెరగవచ్చు.
కన్య
కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో మంచిపేరు పొందుతారు. అదృష్టం అన్నివేలల కలిసి వస్తుంది. పిల్లలు మంచి మార్కులతో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి.
తుల
ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. అప్పుల బాధలు పెరగవచ్చు. ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. చదువుపై మనసు నిలపాలి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృశ్చికం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ కార్యకలాపాలు శుభప్రదంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైన చిక్కులు ఎక్కువ అవుతాయి.
ధనుస్సు
వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రమ అనుకోకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. వృథా ఖర్చులు ఉన్నాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు.
మకరం
కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మంచి పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనిభారం పెరగడంతో అలసట చెందుతారు.
కుంభం
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలను సులభం అవుతాయి.
మీనం
ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఎక్కువ అవుతాయి.