Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 9th).. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
ఈ రోజు(2024 June 9th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంది. ప్రారంభించిన పనులు వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది.
వృషభం
మీమీ రంగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ఇతరులకు హానీ కలుగజేసే పనులు చేయరాదు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేకత ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించకూడదు.
మిథునం
ఇంటిలో జరిగే మార్పులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులను ప్రారంభించకపోవడం మేలు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం
సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యప్రయత్నాలు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది.
సింహం
తప్పుదోవ పట్టించేవారి మాటలు నమ్మొద్దు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారు మానసిక ఆందోళనలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం.
కన్య
కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలి.
తుల
విదేశయాన ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ కలహాలకు అవకాశం ఉంది. ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలి. సహనం అన్నివిధాలా మంచిది.
వృశ్చికం
కొత్త వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు.
ధనుస్సు
పిల్లలతో ఇబ్బందులు ఉన్నాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు పోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
మకరం
ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వస్తు, ఆభరణాలను పొందుతారు. సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. రుణబాధలు ఉండవు. శత్రుబాధలు తొలగిపోతాయి.
కుంభం
బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన చెందుతారు. అనారోగ్య బాధలు ఉన్నాయి. నిందలతో అపకీర్తి పాలౌతారు.
మీనం
సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంది.