»Horoscope Today Todays Horoscope 2024 April 9th Astrology
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 9th).. శుభవార్త వింటారు.
ఈ రోజు(2024 April 9th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
సన్నిహితులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది.
వృషభం
మంచి పనులే చేయండి. మీమీ రంగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎలాంటి కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
మిథునం
సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అజీర్ణ సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక నొప్పులు వేదిస్తాయి.
కర్కాటకం
శుభకార్యాల్లో పాల్గొంటారు. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. బంధువులను కలవడంలో విఫలమవుతారు. వ్యయప్రయాసల వల్ల ఆందోళనకు లోనౌతారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ వలన ధనలాభం ఉంటుంది.
సింహం
అనుకోని ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు నమ్మవద్దు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన ఉంటుంది. కొత్తగా చేపట్టే పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
కన్య
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపం అంత మంచిది కాదు. మీ మాటల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హానితలపెట్టే పనులు చేయరాదు.
తుల
ఆరోగ్యం పట్ల జాగ్రత్తపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో గొడవలు అవుతాయి. సహనం అన్నివిధాలా మంచిది.
వృశ్చికం
నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీమీ రంగాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందుకు సాగాలి.
ధనుస్సు
పిల్లలవల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీమీ రంగాల్లోని పై అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు నెరవేరుస్తారు. అనారోగ్య బాధలు ఉండవు. ప్రయాణాలు చేస్తారు.
మకరం
కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్త వింటారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాలు చేస్తారు. కొత్త పనులు వాయిదా వేసుకోక తప్పదు.
కుంభం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన పొందుతారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. అపకీర్తి పాలు అవుతారు. కొత్త పనులకు ప్రణాళికలు వేస్తారు.
మీనం
నూతన కార్యాలకు ప్రణాళికలు చేస్తారు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంది. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తతో మనోల్లాసాన్ని పొందుతారు.