Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 7th)..వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు.
ఈ రోజు(2024 April 7th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
సమయానికి అప్పుడు లభిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంది. శుభకార్యాల చేయడం వలన డబ్బు నష్టం అవుతుంది. అకాల భోజనం చేయడం వలన అనారోగ్యసమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల వలన ఇబ్బందులు పడుతారు.
వృషభం
అనుకోకుండా ధనం సమకూరుతుంది. మొదలుపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. స్నేహితులతో, బంధువులతో కలుస్తారు. సన్నిహితుల చెలిమి వలన లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు.
మిథునం
మొదలుపెట్టిన పనుల్లో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. అనుకోకుండా ధనం సమకూరుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులు, బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
కర్కాటకం
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు నెరవేరుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు.
సింహం
ఈ రోజు శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు.
కన్య
దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం ఫలిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు సమసిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు.
తుల
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
వృశ్చికం
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
ధనుస్సు
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
మకరం
వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి.మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
కుంభం
ప్రయాణాలు లాభాన్ని చేకురుస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.
మీనం
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మంచివారితో స్నేహం మీకు మేలు చేస్తుంది. ప్రారంభించిన పనుల్లో మీకు విజయం లభిస్తుంది. అనుకోని ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.