»Telangana Student Committed Suicide In Krishna River At Tadepalli
Tadepalli ప్రేమ విఫలమై కృష్ణా నదిలో దూకి తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
తాను చదువుతున్న కళాశాలలోనే ఓ యువతిని ప్రేమించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువకుడు కొన్నాళ్లుగా మనో వేదనతో ఉన్నాడు. ఈ సమయంలో ‘నేను ఇక కనిపించను’ అని తల్లిదండ్రులకు (Parents) చెప్పి వెళ్లిపోయాడు.
తన స్నేహితురాలితో ప్రేమ విఫలమై (Love Fail) తెలంగాణ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏపీలోని తాడేపల్లిలో (Tadepalli) కృష్ణానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటనతో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో (Suryapet District) విషాదం అలుముకుంది. ఇక కనిపించనని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ విద్యార్థి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా మోతే (Mothe) మండలం మాజీ ఎంపీపీ కుమారుడు లోకేశ్. హైదరాబాద్ (Hyderabad) శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (B Tech) మూడో సంవత్సరం చదువుతున్నాడు. తాను చదువుతున్న కళాశాలలోనే (College) ఓ యువతిని ప్రేమించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువకుడు కొన్నాళ్లుగా మనో వేదనతో ఉన్నాడు. ఈ సమయంలో మే 29వ తేదీన ‘నేను ఇక కనిపించను’ అని తల్లిదండ్రులకు (Parents) చెప్పి వెళ్లిపోయాడు. ఎంతకీ గాలించిన లోకేశ్ ఆచూకీ లభించలేదు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, అకస్మాత్తుగా ఏపీలోని గుంటూరు జిల్లా (Guntur District) తాడేపల్లికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణానదిలో (Krishna River) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు (Police) సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో లోకేశ్ ను గాలించి ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికి తీశారు. అతడి వద్ద ఉన్న ఆధారాలతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.