AP: వైజాగ్‌లో సంచలనం రేపిన జాయ్ జెమియా హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది. బాధితుల నుంచి డబ్బులు తీసుకొని విశాఖ సీపీ ఆమెను ఇరికించారని ఆరోపణలు చేశారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట్ మండలం ముస్తాపూర్ వద్ద మక్కల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ నుంచి మక్కల లోడుతో కామారెడ్డి వెళ్తున్న లారీ.. ముస్తాపూర్ మూలమలుపు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: భూ వివాదంలో గొడ్డలితో నరుకున్న ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో జరిగింది. మామిడాల గ్రామానికి చెందిన అన్నదమ్ముల కుమారులు భూ వివాదంలో గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కులు జిల్లాలో బస్సు లోయలో పడి డ్రైవర్ మరణించాడు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: కంభం మండలం రావిపాడుకు చెందిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య సోమవారం బాంబు పేలుడులో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సుబ్బయ్య పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అంతకు ముందు ఉగ్రవాదులు అమర్చిన మందు పాత్ర పై కాలు వేశాడు. బాంబు పేలడంతో ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ASR: చింతూరు మండలం సరివెళ్ల గ్రామం వద్ద సీపీఐ మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున ఒక కార్‌కి నిప్పంటించారు. చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరివెళ్ల వద్ద జరిగిన ఈ సంఘటనపై చింతూరు పోలీసులు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
CTR: గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకరప్ప ఇంట్లో వన్యమృగాలను వేటాడడానికి తయారు చేసుకున్న నాటు బాంబులను మిద్దెపై నిల్వ ఉంచారు. వాటిని ఆయన పెంచుకున్న వేట కుక్క కొరకడంతో అక్కడిక్కడే మృతిచెందింది. నాటు బాంబు పేలుడుతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
BPT: పట్టణంలోని బృందావనం వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టిందా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా అనే వివిధ కోణాలలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
NLR: ఆత్మకూరు మండలంలో నిన్న రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. చేజర్ల మండలం ఆదూరుపల్లిలోని పెంచలయ్య లారీ కాటా దుకాణాన్ని నిన్న రాత్రి 10 గంటలకు మూత వేసి వెళ్లారు. రాత్రి వేళ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.లక్ష వరకు నష్టం జరిగిందని బాధితుడు పెంచలయ్య వాపోయారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయా? లేదా కావాలనే ఎవరైనా నిప్పు పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది.
కడప: చాపాడు మండల కేంద్రమైన అదే గ్రామానికి చెందిన పూజారి సురేశం(32) అనే యువకుడు కుందూ నదిలో పడి మృతి చెందాడు. 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి చాపాడుకు వచ్చిన సురేశ్ సోమవారం మధ్యాహ్నం కుందూ నది వద్దకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు గానీ సురేశ్ నదిలో కొట్టుకుపోవటాన్ని గమనించిన స్థానికులు కుటుంబానికి తెలిపారు. మంగళవారం ఉదయం మృతదేహం బయటపడింది.
KKD: తుని కట్రాల కొండ తాండవనిధిలో రెండు రోజుల కిందట గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమయింది. శనివారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళుతుండగా నీటిలో ఆ వ్యక్తి పడిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. అప్పటినుంచి గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహం లభ్యం కాలేదు. తాజాగా సోమవారం తాండవ నది శివారులో తేలుతూ మృతదేహం కనిపించింది.
ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ శివారులో బొగ్గుల బట్టిలో పనిచేస్తున్న సుబ్బమ్మ అనే వివాహిత కుటుంబ సమస్యల కారణంగా విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
ELR: కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం గ్రామ సమీపంలో పేకాట శిబిరంపై సోమవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈనాడులో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.23,000 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
CTR: మాయమాటలతో యువతిపై అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కార్వేటినగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)తో యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఆదివారం రాత్రి పళ్లిపట్టులో సినిమా చూడటానికి ఇద్దరూ వెళ్లారు. మార్గమధ్యలో యువకుడు పొలాల్లోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని యువతి తండ్రికి చెప్పింది. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
GNTR: రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న షేక్ కాజా మొహిద్దీన్(32) సోమవారం మృతి చెందాడు. వారి బంధువుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లిలోని ఓ ఫైనాన్స్ విభాగంలో కాజా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. పాటిబండ్ల గ్రామంలో తన తల్లిని చూసేందుకు ఆదివారం ఉదయం వచ్చి మొహిద్దీన్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.