AP: పశ్చిమగోదావరి జిల్లాలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకుంది. పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తులసి అనే మహిళకు ఎలక్ట్రిక్ సామాగ్రి అంటూ దుండగుడు పార్శిల్ తీసుకొచ్చాడు. పార్శిల్ బాక్స్‌లో కుళ్లినస్థితిలో ఏ వ్యక్తి మృతదేహం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ నయీమ్ అస్మి పరిశీలించారు. ఉండి మండలంలోని యండగండిలో ఈ ఘటన చోటుచేసుకుంది.