HYD: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. మోండా మార్కెట్లో సంఘటన జరిగిన 24 గంటల్లో మహంకాళి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న పాన్ షాప్‌లో మంటలు చెలరేగాయి. స్పాట్‌కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. షాప్‌లో దేవుడికి పెట్టిన దీపం అంటుకొని మంటలు ఏర్పడినట్లు గుర్తించారు.