AP: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా.. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కననున్న చెట్టను ఢీ కొట్టింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
W.G: కొవ్వూరులోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏషియన్ పెయింట్స్ గోడౌన్ సమీపంలో హైవేపై గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహంపై అనేక వాహనాలు వెళ్లడంతో ముక్కలు ముక్కలైందని కొవ్వూరు పోలీసులు తెలిపారు. మృతుడు యాచకుడై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ముక్కలైన మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సునీల్ జైన్ అనే వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఫ్లోర్ మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: విజయనగరం – కొత్తవలస రహదారిపై శనివారం సాయత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు జామి మండలం లోట్లపల్లికి చెందిన మహిళ బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నుంచి జారిపడిన మహిళ కాళ్లపై లారీ వెళ్లడంతో రెండు కాళ్లు చితికిపోయాయి. వెంటనే స్థానికులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
TG: ఖమ్మం జిల్లా వైరాకు చెందిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. నరసింహారావు అనే వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. రూ.15 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో రూ. 15 లక్షలు పంపించాడు. అనంతరం మళ్లీ రూ. 5 లక్షలు పంపాలని బెదిరింపులకు పాల్పడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
AP: వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేముల మండలం కొత్తపల్లిలో ఓ యువతిపై కుల్లాయప్ప అనే యువకుడు దాడి చేశాడు. తనను ప్రేమించలేదనే కసితో యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కత్తితో దాడి పొడిచాడు. అతి కిరాకతంగా 13 సార్లు కత్తితో పొడినట్లు తెలుస్తోంది. ఆ యువతిని పులివెందులలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జనగామ: పాలకుర్తి మండలంలోని బొమ్మెర గ్రామానికి చెందిన జిట్టబోయిన లచ్చయ్యకు సంబంధించిన గొర్రెలు మేతకు పోయి సాయంత్రం తిరిగి ఇంటి కొస్తున్న క్రమంలో గుర్తుతెలియని కారు ఢీ కొని 10 గొర్రెలు మృతి చెందాయి. రోడ్డు పైన ఉన్న గొర్రెలను యాక్సిడెంట్ చేసి కారు ఆపకుండ వెళ్ళిపోయింది. పాలకుర్తి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
జనగామ: చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో సంగి రమేష్ అనే రైతుకు చెందిన వరి గడ్డి శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంకు గురై దగ్ధం అయింది. దీంతో రమేష్‌కు చెందిన దాదాపు 200 గడ్డి కట్టలు మంటలకు ఆహుతి అయ్యాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబానికి చెందిన రైతును సంబంధిత అధికారులు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
HYD: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గంలోని నారాయణ హైస్కూల్లో టీచర్ 10వ తరగతి చదువుతున్న బాలు అనే విద్యార్థిని గోడ కూర్చీ వేయించారు. దీంతో అవమానం భరించలేక ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మాహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ధృవీకరించారు.
TG: మేడ్చల్ జిల్లాలోని చింతల్‌లో ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మంది పిల్లలు రక్తపు వాంతులు చేసుకోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలోని వాష్‌రూములు క్లీన్ చేస్తుండగా యాసిడ్ కింద పడింది. యాసిడ్ గాడ్పు వాసనకు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KMR: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో వివాహిత ఎర్ర మీన శనివారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
GDWL: అయిజ మండలం సంకాపురం గ్రామానికి చెందిన వివాహిత అనిత (22) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో అనిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. గమనించిన గ్రామస్థులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన సాటుకూరి బాలరాజు (45) చెరువులో పడి మృతి చెందారు. తూప్రాన్‌కి చెందిన బాలరాజు ఈరోజు ఉదయం పెద్ద చెరువు కట్టపై గల వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. పెద్ద చెరువులో శవమై తేలాడు. మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ELR: వెంకటాద్రి గూడెంలో కృష్ణ బాబు (31) అనే వ్యక్తి శుక్రవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చింతలపూడి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి వైద్యులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం కృష్ణ బాబు మృతి చెందాడని, మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.
TG: రాష్ట్రంలో మరోసారి భూకంపం వచ్చింది. మహబూబ్‌నగర్‌లో భూప్రకంపనలు వచ్చాయి. కౌకుంట్ల మండలంలోని దాసరిపల్లి కేంద్రంగా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. కాగా, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూకంపం అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.