NLR: అల్లూరు మండలం వుడ్ హౌస్ పేట తెల్లగుంట మార్గమధ్యంలో బిట్రగుంటకు పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇసుకపల్లి దళితవాడకు చెందిన నూనె కామాక్షమ్మ ట్రాక్టర్ చక్రాల కింద పడి మృతి చెందారు. సంఘటన స్థలానికి అల్లూరు ఎస్సై కిషోర్ బాబు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
RR: స్కూలుకు సరిగా వెళ్లడం లేదని మందలించడంతో సమాచారం అందించకుండా ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వెలి జర్ల గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తెలిపారు. బంధువుల ఇళ్లను సంప్రదించగా ఆచూకీ లభించకపోవడంతో జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ లభించిన వారు ఈ నంబర్‌కు 9848705944 సమాచారం ఇవ్వగలరు.
AP: పోలవరం ప్రాజెక్టును రేపు CM చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రాజెక్టు వద్ద బందోబస్తుకు వెళ్లిన బాంబ్‌స్క్వాడ్ డీఎస్పీని తేనెటీగలు దాడి చేశాయి. ముందస్తుగా పోలవరం స్పిల్ వే గేట్ వద్ద బాంబ్ స్క్వాడ్ డీఎస్పీ రామకృష్ణ తనిఖీలు చేశారు. ఈ సమయంలో తేనెటీగలు ఆయనపై ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన డీఎస్పీని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణకు డాక్టర్లు వైద్య సేవలు అంద...
మేడ్చల్: తండ్రి మందలింపుతో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించిన ఘటన జవహర్నగర్ PS పరిధిలో జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈనెల 14న వెంకటేష్ కుమారులు సాయికృష్ణ, సాయికుమార్ ఫోన్ గురించి గొడవపడ్డారు. దాంతో తండ్రి వెంకటేష్ పెద్ద కుమారుడు సాయికృష్ణను మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సాయికృష్ణ ఇంట్లో యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం: తాడిపత్రి మండలం బుగ్గ-తలారి చెరువు గ్రామాల మధ్య గాలిమరలు, సోలార్ ప్లాంట్ దగ్గర ఉన్న పవర్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలారి చెరువు వీఆర్వోతో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో నవజాత మగ శిశువు మృతి చెంది ఉన్నట్లు గ్రామస్థులు నేడు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముంబై వర్లీ బిసెంట్ రోడ్డులోని అట్రియా మాల్ ఎదురుగా ఉన్న పూనమ్ ఛాంబర్స్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఏడంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: భార్యను అడవిలో వదిలి వెళ్లాడో భర్త. వివరాల్లోకి వెల్తే.. అల్వాల్లో ఉండే విక్రమ్, రబియాను DEC 4న ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో కాపురం పెట్టిన వీరి మధ్య గొడవలు జరగడంతో HYDకి వచ్చేశారు. ఇక్కడా గొడవ జరగడంతో రబియా మాత్రలు మింగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన భర్త ఆమెను సిద్దిపేట జిల్లాలోని అడవిలో వదిలేశాడు.
SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గ్రామంలోని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో దుర్గం చిరంజీవి పొలానికి వచ్చి పనులు చేస్తుండగా తన పొలంలో ఓ వ్యక్తి బైక్‌తో సహా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని రాచర్ల మండలంలో బెల్టు షాపులపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. జేపీ చెరువు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 96 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలియజేశారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతిచెందింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగశ్రీవందన పరిమళగా గుర్తించారు. ఈమె టెన్నెసీ రాష్ట్రంలో ఎంఎస్ చదువుతుంది. పరిమళ మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపించేందుకు తానా ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
NZB: నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఆదివారం ఉదయం హనుమాన్ నగర్‌కు చెందిన వేముల రాసోటి అనే వ్యక్తి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి బైక్ వచ్చి ఢీకొట్టింది. దీంతో తలకు ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని జీజీహెచ్ఏం హాస్పిటల్‌కి తరలించారు.
ATP: రాయదుర్గం మండలం రాతిబావి వంక గొల్లల దొడ్డి సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై ఎలుగుబంటి మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రాతిబావివంక గొల్లలదొడ్డి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎలుగుబంటి ఎక్కడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు.
NDL: నందికొట్కూరులో ఈనెల 9న యువతికి నిప్పంటించి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రేమోన్మాది రాఘవేంద్రకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర శరీరం చాలా వరకు కాలిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ జంటకు అంతలోనే నూరేళ్లు నిండిపోయాయి. కేరళలోని పతనం తిట్టలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా.. అందులో ఇద్దరు నూతన వధూవరులు. కొత్త పెళ్లికూతురు అను, వరుడు నిఖిల్‌గా పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.