TG: గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 50 మంది యువతులను మోసం చేసిన విగ్గురాజు వంశీకృష్ణ మ్యాట్రిమోనిల్లో విగ్గులతో ఫొటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు ఇస్తున్నాడు. తాజాగా డాక్టర్ సంబంధం కుదుర్చుకుని యువతి తండ్రి నుంచి రూ.40 లక్షలు వసూలు చేశాడు. మోసాన్ని గుర్తించి పీఎస్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నట్లు సమాచారం.