• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

శబరి వెళ్లిన భక్తులకు తప్పిన ప్రమాదం

AP: విజయనగరం జిల్లా నుంచి శబరి వెళ్లిన భక్తులకు ప్రమాదం తప్పింది. గత నెల 25న రేగిడి మండలం మజ్జిరాముడుపేట నుంచి 41 మంది శబరి వెళ్లారు. కంచి వద్ద బస్సు ఆపి వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అయ్యప్ప భక్తుల బస్సు, సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అయ్యప్ప భక్తులు తిరిగి కంచి నుంచి మరో బస్సులో స్వగ్రామం బయల్దేరారు.

December 3, 2024 / 04:20 PM IST

ఏర్పేడు-వెంకటగిరి రోడ్డుపై మరో ప్రమాదం

CTR: ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారిపై మంగళవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాలెం టోల్ ప్లాజా వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. కారులో ఉన్న వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. ఉలుకు పలుకు లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

December 3, 2024 / 04:11 PM IST

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ATP: ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచిరూ.22 లక్షల విలువైన 310 గ్రాముల బంగారు నగలు, ఒక కారు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. 

December 3, 2024 / 04:09 PM IST

విద్యుత్ షాక్‌తో ఆవులు మృతి

SKLM: ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామంలో పొట్లూరు అచ్యుతరావు, పిల్లాటి అప్పన్నమ్మకు చెందిన ఆవులు ఊరి చివర పంట పొలాలలో మేత కోసం వెళ్లగా అక్కడ తెగివున్న విద్యుత్ వైర్లు తగిలి మూడు ఆవులు మంగళవారం విగత జీవులుగా మారాయి. యజమాని లబోదిబోమంటూ రోధిస్తున్నారు. తమ జీవనం ఆవులు పైనే కొనసాగుతుందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

December 3, 2024 / 03:36 PM IST

పిడుగుపాటుకు రైతు మృతి

NLR: సంగం మండలం మర్రిపాడులో చిట్టిబోయిన వెంకటేశ్వర్లు అనే రైతు మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వర్షం వస్తున్న సమయంలో పొలంలో పనిచేస్తుండగా అతని వద్ద పిడుగు పడినట్లు సమాచారం. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

December 3, 2024 / 03:21 PM IST

MURDER: బ్యాంకు ఉద్యోగి దారుణ హత్య

TG: వరంగల్ జిల్లా రంగంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రాజమోహన్‌ను కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. కారులో మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లారు. సీసీ ఫుటేజ్‌లో నిందితుల దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 3, 2024 / 01:41 PM IST

తెలుగు గంగ ప్రధాన కాలువ అక్విడెక్టుకు గండి

CTR: వరదయ్యపాళ్యం మండలం సిద్ధాపురం సమీపంలోని 129 కిలోమీటర్ వద్ద తెలుగు గంగ ప్రధాన కాలువ అక్విడెక్టుకు గండి పడింది. ఈ గండి కాస్త పెద్దదైతే ప్రధాన కాలువకే గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో అక్విడెక్టు వద్ధ స్వల్ప కాలిక లీకేజీ ఉండేదని.. ప్రస్తుతం ఆ లీకేజీ ఎక్కువై గండి పడినట్లు చెప్పుకొచ్చారు. 

December 3, 2024 / 12:20 PM IST

కావలి హైవే వద్ద లోయలో పడిన లారీ

NLR: కావలి హైవే వద్ద అల్లిగుంటపాలెం జంక్షన్ సమీపంలో మంగళవారం ఉదయం 4 గంటలకు లారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి నేషనల్ హైవే పోలీసులు వచ్చి క్రేన్లు సహాయంతో లారీని బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

December 3, 2024 / 11:20 AM IST

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

MBNR: చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన విజయ్ (16) మంగళవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసే సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, విజయ్ చిన్నచింతకుంటలో పదో తరగతి చదువుతున్నాడు.

December 3, 2024 / 11:01 AM IST

అమలాపురం ప్రేమజంట ఆత్మహత్య

కోనసీమ: విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమలాపురానికి చెందిన సుష్మిత, దుర్గారావు కుటుంబాలు బ్రతుకుదెరువు కోసం షీలానగర్‌లో నివాసం ఉంటున్నారు. సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరుకుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశారు.

December 3, 2024 / 10:59 AM IST

బంగ్లాలో చిన్మోయ్ లాయర్‌పై ఇస్లామిస్టుల దాడి

బంగ్లాదేశ్‌లో అరెస్టయిన హిందూ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాది రామన్ రాయ్‌పై తాజాగా ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారు. ‘ఇస్లామిస్టులు అతని ఇంటిపై క్రూరంగా దాడి చేశారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. చిన్మోయ్ తరపున మాట్లాడటమే అతను చేసిన అతి పెద్ద తప్పు’ అని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారమన్ దాస్ ఎక్స్ వేదికగా తెలిపారు.

December 3, 2024 / 10:41 AM IST

బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

W.G: పెనుమంట్ర మండలం మార్టేరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్టేరు నుంచి పెనుగొండ వెళ్లే రోడ్డులో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

December 3, 2024 / 10:36 AM IST

చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి

అన్నమయ్య: వాల్మీకిపురంలోని టీఎంలోయ వద్ద మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొని యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. కలికిరికి పట్టణం, శివాలయం వీధిలో ఉండే అబ్దుల్ల కొడుకు అశ్రఫ్ (27) మదనపల్లె నుంచి కలికిరికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

December 3, 2024 / 10:28 AM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అక్కా, తమ్ముడు

WNP: రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25), అక్క పద్మ(31) ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. వీరి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస...

December 3, 2024 / 10:28 AM IST

చెన్నేరి వద్ద రోడ్డు ప్రమాదం

CTR: సత్యవేడు మండలం చెన్నేరి గ్రామం వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొనడంతో వాహనదారులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చెన్నేరి మాదిగవాడకు చెందిన శ్రీనివాసులు తమిళనాడు ఊతుకోట నుంచి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో పుదుకుప్పం గ్రామానికి చెందిన భార్గవ్ కూడా తలకు గాయమైనట్టు సమాచారం.

December 3, 2024 / 10:08 AM IST