W.G: నల్లజర్ల మండలం దుబచర్లలో శుక్రవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ఎర్టిగా కారు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీ కొట్టిన వెంటనే కారు ముక్కలైంది. కారులో 11 మంది ఉన్నారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలవగా.. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రకాశం: కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలోని స్థానిక దర్గా సెంటర్ నందు బీహార్ రాష్ట్రానికి చెందిన సలీమా ఖాతుమ్ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించారు. అయితే యువతి ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.
PLD: ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో బుధవారం రాత్రి షేక్ బారాన్ (57) అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేసి తలపై గుండెలపై తీవ్రంగా రాడ్లతో కొట్టారు. సమాచారం అందుకున్న 108సిబ్బంది క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో గురువారం బరాన్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ATP: తాడిపత్రి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై వివాహిత మృతి చెందింది. శుక్రవారం తెల్లవారుజామున వంట చేయడానికి రైస్ కుక్కర్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ELR: దెందులూరు మండలం సింగవరం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన మంతెన రామరాజు దంపతులు బైక్‌పై భీమడోలు వెళ్తుండగా సింగవరం కూడలిలో తాడేపల్లిగూడెం వైపు నుంచి వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా.. ఏలూరు ఆసుపత్రికి తరలించారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడెంలో నీలాలమ్మ గుడి వద్ద ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి మరొక వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అతడి కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుంది. బియ్యం అక్రమాలపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ అధికారులు 1,066 కేసులు నమోదు చేశారు. 729 మంది అక్రమ రవాణాదారులను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే, లుకౌట్ నోటీసులు ఇవ్వడంపై విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి వ్యాఖ్యలకు మంత్రి నా...
CTR: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున హత్య జరిగింది. పులిచెర్ల పంచాయతీ సురేంద్ర నగర్ కాలనీకి చెందిన ధనుష్ మద్యం మత్తులో తండ్రి గోపాల్‌తో గొడవపడ్డాడు. ఈక్రమంలో ధనుష్ బండరాయితో తండ్రిని కొట్టడంతో.. తీవ్రంగా గాయపడిన తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కల్లూరు ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు ధనుష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా: గుడివాడ కేటీఆర్ కాలేజీ సమీపంలోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వాహిస్తున్నవారిని టూ టౌన్ పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేసారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు నివాస గృహంపై దాడి చేసి వ్యభిచార వృత్తి నిర్వాహకుడుతో పాటు అతని ముగ్గురు అనుచరులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్టేషనుకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: ANUలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పృథ్వీరాజ్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల కథనం.. పెదకాకాణిలోని నంబూరు విజయభాస్కర్ నగర్‌కు చెందిన యువతి ANUలో ఇంజినీరింగ్ చదువుతోంది. పృథ్వీ ఆ యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆతనికి నగదు, లాప్‌ట్యాప్ ఇచ్చినట్లు పేర్కొంది.
కడప: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని రవీంద్రనగర్‌కు చెందిన ఎస్.రమేష్ గురువారం కడప-రాయచోటి మార్గంలో గల గువ్వల చెర్వు ఘాట్‌లో 108 వాహనం బ్రేక్ ఫెయిల్ అయ్యి వాహనం అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రగాయలు కావడంతో జిల్లాలోని జగదీష్ న్యూరో హాస్పిటల్లో సర్జరీ జరిగింది. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. ఈ మరణవార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ఎస్ఎన్ పురంలో ఏపీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం అర్ధరాత్రి భవనంపై ఉరేసుకున్న ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఉరికి వేలాడుతూ ఉన్న మృతదేహాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించారు. ఎస్ఐ సందీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: పెదబయలు మండలం కొజ్జరిగూడలో శుక్రవారం ఓ జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. నిర్మాణంలో ఉన్న కల్వర్టు డైవర్షన్ రహదారిలో వర్షాలకు రోడ్డు దిగిపోయి జీపు బోల్తా పడింది. జీప్‌లో ఉన్న డ్రైవర్ ముందుగా దూకేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. చిత్రకొండలో ఓ కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి తిరిగి అరకు వెళుతుండగా జీపు బురదలో జారి ప్రమాదానికి గురైంది.
కృష్ణా: నూజివీడు ఎంప్లాయిస్ కాలనీలోని చిల్డ్రన్స్ పార్క్ సిమెంట్ రోడ్డు మార్జిన్ లేక ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నిత్యం స్కూల్ బస్సులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. సిమెంట్ రోడ్డుకు మార్జిన్ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇద్దరు విద్యార్థులు సైకిల్‌పై వెళ్తూ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయారు.