KMR: ఎల్లారెడ్డి మండలం రేపల్లేవాడి గ్రామానికి చెందిన పిట్ల స్వప్న (25) బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మెదక్ జిల్లాకు కోచ్చారం నుంచి ద్విచక్ర వాహనంపై తన మరిది శ్రీనివాస్‌తో స్వప్న వస్తుండగా బైక్ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు.