ATP: యాడికి మండలం బోయరెడ్డిపల్లి వద్ద ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో క్రిష్టిపాడుకు చెందిన శివకేశవ అనే కార్మికుడు మృతి చెందగా.. షణ్ముఖ రెడ్డి, దీపక్ సింగ్, ధన్వార్ సింగ్, కంబగిరి స్వామికి త్రీవ గాయాలయ్యాయి. వీరు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.