మాజీ ఎంపీ, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కోర్టు రేపటి వాయిదా వేసింది.
వివిధ నియామక పరీక్షల మధ్య వ్యవధి ఉండాలనే నిబంధన పాటించడం లేదని అభ్యర్థులు వాదిస్తున్నారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ ఈ పిటిషన్ విషయంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అయితే పరీక్ష నిర్వహణపై మాత్రం స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయినా నిర్వహించని కేంద్రం ఇప్పుడు అకస్మాత్తుగా ఉత్సవాలు నిర్వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో కేంద్రం కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
తీవ్ర విషాదంలో ఉన్న ఆమె ఎవరితో సక్రమంగా మాట్లాడడం లేదు. ఆమె పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అందుకే ఆమె వెన్నంటే అందరూ ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోయిన ఆమె తెల్లవారుజామున ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో కుటుంబీకులు హతాశయులయ్యారు.
తెలంగాణ సచివాలయాన్ని(Secretariat) అద్భుతంగా కట్టారని, కానీ తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని తమిళి సై చెప్పారు. కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని అన్నారు.
గ్రామాల్లో డప్పు చాటింపు కూడా వేయించి ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
కాస్త నమ్మాం అనుకుంటే చాలు ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మనలో చాలా మంది కూడా ఎవరైనా నమ్మకంగా నాలుగు మాటలు చెబితే వెంటనే వారు ఎవరు అనేది కూడా ఆలోచించకుండా నమ్మేస్తాం. ఇక సెలబ్రెటీల పేర్లు చెబితే గుడ్డిగా నమ్మేస్తాం. అలా నమ్మేవారిని మోసం చేసేవాళ్లు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు.
వివాదంలో చిక్కుకున్న మళ్లీ పెళ్లి సినిమా ఈ సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్ తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని రమ్య రఘుపతి ఆరోపణ మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టును కోరిన రమ్య రఘుపతి ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతుంది రేపు విడుదల కానున్న మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు
మూడేళ్లుగా ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి బాబు (7), లక్ష్మి (3) సంతానం. పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత తన కుమార్తె లక్ష్మితో కలిసి నిద్రపోయింది.
తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి EAMCET 2023 ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86 శాతం అర్హత సాధించారు. జూన్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనుంది. ఈ ఫలితాల్లో మొదటి ర్యాంక్ అనిరుథ్ సనపల్లు, సెకండ్ మనీందర్ రెడ్డి, మూడో ర్యాంక్ చల్లా రమేష్, నాలుగో ర్యాంక్ అభినిత్ మంజేటి, ఐదో ర్యాం...
బంధుమిత్రులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఈ సమయంలో కొంత అలసటకు గురైన శంకర్ మండపంపై కుర్చీలో కూర్చున్నారు. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు వచ్చి లేపి చూడగా అచేతనంగా పడి ఉన్నారు.
సమాచారం తెలుసుకున్న ఆయా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మహేశ్ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. చేతికొచ్చిన పెద్ద కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.