»Telangana High Court Refuses To Grant Stay On Group 1 Prelims Exam
Group 1 Prelims Exam అభ్యర్థులకు చుక్కెదురు.. ఆపేది లేదన్న తెలంగాణ హైకోర్టు
వివిధ నియామక పరీక్షల మధ్య వ్యవధి ఉండాలనే నిబంధన పాటించడం లేదని అభ్యర్థులు వాదిస్తున్నారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ ఈ పిటిషన్ విషయంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అయితే పరీక్ష నిర్వహణపై మాత్రం స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
జూన్ 11వ తేదీన టీఎస్ పీఎస్సీ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. ఆ పరీక్ష వాయిదా వేసేలా ఆదేశాలు (Orders) జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో 36 మంది అభ్యర్థులు (Aspirants) పిటిషన్ దాఖలు చేశారు. వివిధ నియామక పరీక్షల మధ్య వ్యవధి (Gap) ఉండాలనే నిబంధన పాటించడం లేదని అభ్యర్థులు వాదిస్తున్నారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ (Justice Pulla Karthik) ఈ పిటిషన్ విషయంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అయితే పరీక్ష నిర్వహణపై మాత్రం స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.