రెస్టరెంట్ల పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలకు ధ్రువీకరించేందుకు స్విగ్గీ ‘స్విగ్గీ సీల్’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం పుణెలో అందుబాటులో ఉన్న ఈ సేవలను.. నవంబర్ నాటికి 650 నగరాలకు విస్తరిస్తామని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. రెస్టరెంట్ల నుంచి ఈ కొత్త ఆలోచనకు మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే వందలాది రిక్వెస్టులు వచ్చాయని పేర్కొంది.