దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 79,921.13 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కాసేపటికే లాభాల్లోకి వెళ్లిన సూచీ.. ఇంట్రాడేలో 80,646.31 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 138.74 పాయింట్ల నష్టంతో 80,081.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.60 పాయింట్ల నష్టంతో 24,435.50 స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84.08గా ఉంది.