వినాయక చవితి పర్వదినం మరో రెండు రోజుల్లో రాబోతోంది. ఈ పర్వదినాన్ని జరుపుకోవడానికి దేశ ప్రజలంతా ఎంతో ఉత్సాహం చూపిస్తారు. దేశ నలుమూలలా ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో మండపంలో ఒక్కో రూపంలో గణేషుడు కొలువై ఉంటాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. అత్యంత ఖరీదైన వినాయక విగ్రహం మాత్రం ముంబయిలోనే కొలువై ఉంది. ఇక్కడ.. ఖరీదైన వినాయకుడు అనే కంటే.. ఖరీదైన గణేష్ మండపం అని చెప్పాలేమో. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..
ముంబయిలోని కింగ్స్ సర్కిల్ లోని బీఎస్బీ సేవా మండల్ అత్యంత ఖరీదైన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపం బాధ్యతలు చూసేవారితో పాటు… అక్కడకు వచ్చే భక్తులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం గమనార్హం. ఇందుకోసం దాదాపు రూ.316 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు. ఇందులో రూ.31.97కోట్లు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు ఈ పరిధిలోకి వసతాయి. మరో రూ.263 కోట్లు మండపానికి చేయించారు.
అక్కడ పనిచేసే పూజార్లు, వాలంటీర్లు, వంటవారు, పార్కింగ్, సెక్యూరిటీ ఇలా ప్రతి ఒక్కరికీ ఈ భీమా వర్తిస్తుంది. అగ్ని ప్రమాదం, భూకంపం వంటి వాటి కోసం ప్రత్యేకంా మరో కోటి రూపాయల బీమా తీసుకున్నారు. వీటిలోకి అక్కడి ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీ టీవీలు, స్కానర్లు వంటివి వస్తాయి.