HDFC బ్యాంకు కొన్ని క్రెడిట్ కార్డులకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డు పాయింట్ల రిడీమ్‌ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి పరిమితం చేసింది. తనిష్క్ వోచర్లపై రివార్డు పాయింట్ల రిడీమ్‌ను 50,000 రివార్డు పాయింట్లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డులకు మాత్రమే వర్తిస్తాయి.