Gold Rates Today : గుడ్‌ న్యూస్‌… పసిడి ధరల పరుగుకు బ్రేక్‌

పసిడి పరుగుకు బ్రేకులు పడింది. సోమవారం బంగారం ధర ఆరు వందల రూపాలకు పైగా తగ్గుముఖం పట్టింది. పసిడి, వెండి ధరలు ఎంతెంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

  • Written By:
  • Updated On - April 22, 2024 / 10:52 AM IST

Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. గత కొద్ది కాలంగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు సోమవారం తగ్గుమఖం పట్టాయి. గత శుక్రవారం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.76,141గా ఉంది. అది సోమవారం నాటికి రూ.619 తగ్గి రూ.75,522కు చేరుకుంది

చదవండి :  విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ విజేతగా గుకేష్‌

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.75,522గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్‌ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.

చదవండి : అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సోమవారం రూ.84,953గా ఉంది. శుక్రవారం దీని ధర రూ.85,860 ఉండగా ఉండగా సోమవారం నాటికి రూ.907 వరకు తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్‌ ప్రారంభ సమయానికి తగ్గుముఖం పట్టడం గమనార్హం.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌, వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఔన్స్‌ బంగారం ధర శుక్రవారం 2,392 డాలర్లుగా ఉండగా సోమవారం నాటికి 20 డాలర్ల మేర తగ్గింది. దీంతో సోమవారం దీని ధర 2,370 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర ప్రస్తుతం 28.02 డాలర్లుగా ఉంది.

Related News

Gold Rates Today : ఆకాశాన్నంటుతున్న బంగారం.. ఒక్క రోజే రూ.4వేల పెరిగిన వెండి!

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో శనివారం వెండి, బంగారం ధరలు రెండూ కూడా భారీగా పెరిగాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.